calender_icon.png 7 January, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

04-08-2024 03:26:15 AM

టీఎస్‌టీసీఈఏ డిమాండ్

హైదారబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): ప్రైవేట్ టీచర్లపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అయినేని సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో అర్హతలేని ఉపాధ్యాయులున్నారని సాక్షాత్తు సీఎం చెప్పడం బాధాకరమని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 33 లక్షల మంది విద్యార్థులకు చదువు చెప్తున్న టీచర్ల పట్ల అంత దారుణంగా మాట్లాడటం సమంజసం కాదని పేర్కొన్నారు.