calender_icon.png 15 March, 2025 | 3:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్ సభకు తరలి రావాలి

15-03-2025 12:00:00 AM

జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి

జనగామ, మార్చి 14(విజయక్రాంతి): ఈ నెల 16న స్టేషన్‌ఘ న్‌పూర్‌లో జరుగనున్న సీఎం రేవంత్‌రెడ్డి సభకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలిరావాలని జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పిలు పునిచ్చారు. దోపిడీకి గురైన తెలంగాణ రాష్ట్రాన్ని  అభివృద్ధి వైపు నడి పిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి జనగామ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఈ నెల 16న స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలో కోట్లాది రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయ నున్నట్లు తెలిపారు. ఈ పనులతో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ రూపురేఖలు మారనున్నాయన్నారు. ప్రజలు, కాంగ్రెస్  ముఖ్య నాయకులు, కార్యకర్తలు బహిరంగ సభలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.