calender_icon.png 16 January, 2025 | 4:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్

16-01-2025 01:35:36 PM

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

కరీంనగర్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Kaushik Reddy) అన్నారు. గురువారం కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ.. తుగ్లక్ పాలనతో బీఆర్ఎస్ నేతలను 60 లక్షల మంది కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమైనాయని అడిగితే కేసులు పెడుతున్నారని, కేసీఆర్ హయాంలో ఇచ్చిన రైతుబంధు, కేసీఆర్ కిట్ ఏమైందని అడిగితే కేసులు పెడుతున్నారా? అని ప్రశించారు. ఫార్ములా ఈ రేస్ లొట్టఫీస్ కేసు పెట్టి కేటీఆర్(KTR) ను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ కార్ రేసుతో 700 కోట్ల లాభం తెలంగాణ కు వచ్చిందని నెల్సన్ సర్వే తేల్చిందని పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు(Note For Vote Case)లో చిప్పకూడు తిన్నాడు.. మిగతా వారికి తినిపించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాడన్నారని ఆరోపించారు. ఈ ఫార్ములా చెల్లింపులు అక్రమం అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు బయటపెట్టలేదన్నారు. పిచ్చి ఆలోచనలతో ఫాగల్ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు. ముందే గ్రహించి కేసీఆర్ 60 లక్షల మంది సైన్యాన్ని తయారు చేశారని, బీఆర్ఎస్(BRS) బట్టలు విప్పుతా అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ రెచ్చగొట్టడంతో నీది ఏ పార్టీ అని అడిగాను అన్నారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్ళితే నిలదీయండి రాళ్ళతో కొట్టండని రేవంత్ రెడ్డే నేర్పించారు. ఆయన చెప్పినట్లు రాళ్ళతో కొట్టకుండా ప్రశ్నిస్తే.. ఎమ్మెల్యే లు సంజయ్ తో పాటు కవ్వంపల్లి సత్యనారాయణ, రాజ్ ఠాకూర్ దాడి చేశారన్నారు. మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బెదిరించారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు.