రంగారెడ్డి, జనవరి 16 (విజయ క్రాంతి ): షాద్ నగర్ నియోజక వర్గంలోని ఫారుక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలోని ఉన్నత పాఠశాల 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ నెల 31న నిర్వహించే ఉత్సవాలకు సీఎం ఎనముల రేవంత్ రెడ్డి రానున్నారు. పూర్వ విద్యార్థి ప్రొఫెసర్ హర గోపాల్ ఇటీవల సీఎంను కలిసి ఉత్సవాలకు ఆహ్వానించారు.
ఉత్సాహాలకు వచ్చేందుకు సీఎం అంగీకరిం చారు. గురువారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మొగిలిగిద్ద గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, అధికారులరులతో కలిసి సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించారు.సమావేశంలో డిఇఓ సుశిందర్ రావు, డిపిఓ సురేష్ మోహన్, ఆర్డీవో సరిత, పూర్వ విద్యార్థులు, పాఠశాల విద్యా కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.