హైదరాబాద్: వినాయక చవితి పర్వదినాన్ని పురష్కరించుకోని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ మండపాల్లోకి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలని సీఎం పేర్కొన్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి తెలిపారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద తగిన జాగ్రతలు తీసుకోవాలని పోలీసులు సీఎం ఆదేశించారు. గణపతి మండపాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.