calender_icon.png 13 March, 2025 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ కవితకు బర్త్‌డే విషెస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

13-03-2025 09:16:42 AM

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల(BRS MLC Kalvakuntla Kavitha) కవితకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు ఎమ్మెల్సీ కవితకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao) కూడా కవితకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అటు పలువురు బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, కార్యకర్తలు కవితకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.