calender_icon.png 9 October, 2024 | 12:52 PM

కొత్త టీచర్లకు నియామక పత్రాలు

09-10-2024 10:34:29 AM

హైదరాబాద్: డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం నియామక పత్రాలను అందజేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో కొత్త టీచర్లకు సీఎం నియామక పత్రాలు ఇవ్వనున్నారు. 10 వేల మందికిపైగా అభ్యర్థులు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 11,062 పోస్టుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది. ఏడు నెలల్లోనే మెగా డీఎస్సీ ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. సుమారు 2,46 లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలకు హాజరయ్యారు. అర్హులైన వారికి 1:3 నిష్పత్తితో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ప్రభుత్వం బ్యాక్ లాగ్ పోస్టులు లేకుండా మొత్తం ప్రక్రియను పూర్తి చేసింది.  రాష్ట్రవ్యాపత్ంగా 2,515 స్కూల్ అసిస్టెంట్లు, 685 భాష పండితులు పోస్టులను సర్కార్ భర్తీ చేసింది. 145 పీఈటీ, 6,277 ఎస్జీటీ, 103 స్పెషల్ ఎడ్యుకేటర్, 281 ఎస్టీజీ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. డీఎస్సీలో ఎంపికైన వారికి ఇప్పటికే జిల్లాల వారీగా సమాచారం ఇచ్చింది,