calender_icon.png 3 October, 2024 | 4:43 PM

ప్రతి పేదవాడికి డిజిటల్ కార్డు.. ఎక్కడైనా రేషన్

03-10-2024 01:05:18 PM

సంక్షేమ పథకాల అమలుకు డిజిటల్ కార్డు అవసరం

హైదరాబాద్: సంక్షేమ పథకాలు అందిరికీ అందుబాటులోకి తీసుకురావాలనే కుటుంబ డిజిటల్ కార్డు ఇవ్వాలని ఆలోచించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కుటుంబ డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రశేఖర్ రావు అధికారంలో ఉంటే రేషన్ కార్డు రాదని తమకు అధికారం ఇచ్చారని ఆయన తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచే కార్యక్రమం ప్రారంభించామన్నారు. రేషన్ కార్డు కోసం పదేళ్లు ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారని ఆరోపించారు. ప్రతి పేదవాడికి కార్డు ఇవ్వాలన్న లక్ష్యంతో ఉన్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కొత్తగా రేషన్ కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఆయన తెలిపారు. సంక్షేమ పథకాలకు డిజిటల్ కార్డు అవసరం అన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు కుటుంబానికి రక్షణ కవచం అన్నారు. డిజిటల్ కార్డులో కుటంబానికి సంబంధించిన వివరాలు ఉంటాయని సీఎం తెలిపారు. ఫ్యామిలీ కార్డు ఉంటేచాలు రేషన్ ఎక్కడైనా తీసుకోవచ్చని వెల్లడించారు.