మెదక్ : మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ మాత అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం నాడు దర్శించుకున్నారు. సీఎంకు ఆలయ అధికారులు పూలకుంభంతో స్వాగతం పలుకగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలను సీఎం అందించారు. ఏడుపాయల్లో రూ. 750 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రత్యేక చాపర్ ద్వారా ఏడుపాయలకి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రెవిన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజనర్సింహ, కొండా సురేఖ, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు దామోదర్ రాజనర్సింహ. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే, సంజీవరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు సీఎంకు ఘనంగా స్వాగతం పలికారు.