02-04-2025 12:11:47 AM
గజ్వేల్ ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్
గజ్వేల్, ఏప్రిల్ 1: రాష్ట్ర ప్రజలకు ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారని గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు ద్వారా అందిస్తున్న ఉచిత సన్న బియ్యం పంపిణీని మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని పలు రేషన్ దుకాణాలలో ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్దార్ ఖాన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వమని, గతంలో రూ. 5 కిలో బియ్యం ఉన్నదాన్ని 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డి రూ. 2 లకు బియ్యం ఇచ్చారని తదుపరి కాంగ్రెస్ హయాంలోనే తలసరి నాలుగు కిలోలు ఉన్న బియ్యాన్ని ఆరు కిలోలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదీనన్నారు.
ఇప్పుడు కూడా సన్న బియ్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ప్రజలు రేషన్ కార్డు ద్వారా అందిస్తున్న సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ కరుణాకర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్ , అజ్గార్ జంగం రమేష్ గౌడ్, ఉడెం శ్రీనివాస్ రెడ్డి, డప్పు గణేష్, సత్యం, అరుణ్ ,శ్రావణ్, ఈదుగాని శివులు, దయ్యాల యాదగిరి, కిష్ట, రెడ్డి, అంజద్ పాల్గొన్నారు.