13-03-2025 01:38:55 AM
హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. గురువారం ఉదయం విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌తో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. ప్రస్తు తం విదేశీ పర్యటనలో ఉన్న జైశంకర్ బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకుంటారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విషయమై చర్చించేందుకే రేవంత్ ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కేసు విషయమై ముఖ్యమంత్రి రేవంత్ జైశంకర్ తో చర్చించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పలువురు నిందితులు విదేశాల్లో తలదాచుకుంటుండగా..
వారిని ఎలాగైనా స్వదేశానికి రప్పించి శిక్ష పడేలా చేయలాని ప్రభుత్వం భావిస్తోంది. ఆయా దేశాల విదేశాంగ శాఖలతో మాట్లాడి నిందితులను భారత్‌కు రప్చించేలా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేయనున్నారని సమాచారం.