15-03-2025 03:27:55 PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సోషల్(Social Media) మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టేవారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో భాష చూడండి.. కుటుంబ సభ్యులు, ఆడబిడ్డల మీద ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారని తెలిపారు. ప్రజా జీవితంలో ఉన్నాం కదా అని ఓపిక పడుతున్నా, కాదు అంటే.. ఒక్కడు బయట తిరగలేడని హెచ్చరించారు. మీ అమ్మపై, చెల్లిపై ఇలాంటి పోస్టులు పెడితే ఊరుకుంటారా? అన్న సీఎం రేవంత్ రెడ్డి హద్దు దాటితే ఇకపై ఊరుకునేది లేదన్నారు. ఆడపిల్లల వీడియోలు తీసి పోస్ట్ చేస్తే ఎలా? జర్నలిస్టు అంటే వివరణ ఇవ్వండన్నారు. ముసుగేసుకుని వస్తే గుడ్డలు ఊడదీసి కొడతానని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిపాడేశారు.