ఎవరినీ ప్రభుత్వం వదిలిపెట్టదు
నేను కుర్చీలో ఉన్నంత వరకు ఇలాంటి ఘటనలు ఉపేక్షించను
సినిమా ప్రముఖులకు ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా
హైదరాబాద్: సినిమా ప్రముఖులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వార్నింగ్ ఇచ్చారు. అమానవీయ ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేందని లేదని హెచ్చరించారు. సినిమాలు తీసుకోండి, వ్యాపారం చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి, ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు తీసుకోండి, షూటింగ్ లకు సంబంధించి ప్రత్యేక అనుమతులు కూడా తీసుకోండి.. కానీ ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితులకు కారణమైతే మాత్రం ఏమీ ఉండవని తేల్చిచెప్పారు. ప్రజలు ప్రాణాలు పోతుంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. తాను కుర్చీలో ఉన్నంత వరకు ఇలాంటి ఘటనలు ఉపేక్షించనని పేర్కొన్నారు. ప్రజలు ప్రాణాలు పోయే ఘటనలు జరిగితే ప్రత్యేక మినహాయింపులు ఉండడని తెలిపారు. తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడటమే తన బాధ్యతన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎవరినీ ప్రభుత్వం వదిలిపెట్టదని హెచ్చరించారు.