20-02-2025 01:07:10 AM
వీఐపీ, వీవీఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లు
23న యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి రాక
సంబంధిత అధికారుల సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 19 ( విజయ క్రాంతి): ఈ నెల 23న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బంగారు విమాన గోపుర మహా కుంభా భిషేక సంప్రోక్షణ మహోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేస్తున్నందున పకడ్బందీగా పటిష్టమైన ఏర్పాట్లు చేప డుతూ పర్యవేక్షణ చేపట్టాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం యాదగిరిగుట్ట దేవస్థాన కార్యాలయంలో ప్రిన్సిపాల్ సెక్రటరీ జిల్లా కలెక్టర్ హనుమంత రావు, అడిషనల్ డి సి పి లక్ష్మీ నారాయణ, ఆలయ ఈ. ఓ భాస్కర రావు, సంబంధిత అధికారులతో ముఖ్య మంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాట్ల పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ మాట్లాడుతూ ఈ నెల 23 వ తేదీన నిర్వహించే స్వామివారి బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతున్న నేపథ్యంలో పూర్తి భద్రత కల్పించాలని పోలీస్ శాఖ అధికారులకు ఆదేశించారు. హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. భోజన వసతి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఘనంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు కేటాయించిన పనులు త్వరగా పూర్తి చేయా లన్నారు. విఐపి, వివిఐపిలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.
ప్రతి రోజు వివిధ ప్రాంతాల నుండి దేవాల యానికి ఎక్కువ మంది భక్తులు వస్తారని, దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లను సక్రమంగా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశిం చారు. భద్రత ఏర్పాట్లు, భక్తులకు అవసర మైన సౌకర్యాలను పర్యవేక్షిస్తూ, ప్రోటోకాల్ ప్రకారంగా అన్ని ఏర్పాట్లు ఎలాంటి పొర పాట్లకు తావు లేకుండా చూసుకోవాలని, ఆలయం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, క్యూలైన్లను సక్రమంగా నిర్వహించాలని అన్నారు. ఆలయ పరిసరాల పరిశుభ్రత, శానిటేషన్, తాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు.
పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేసి నిరం తరం పర్యవేక్షణ జరపాలని ఈ సందర్భంగా తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తగిన బందోబస్తు ఏర్పాటు, ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా,పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు సూచించారు. ఎమర్జెన్సీ సేవలను అందు బాటులో ఉంచాలని, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని , సి.పి.ఆర్ చేసే వైద్యులను కూడా అందుబాటులో ఉంచా లని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు.
సూదుర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఇబ్బం దులు కలగకుండా ఆర్టీసీ వారు అదనపు బస్సులు నడప డంతో పాటు, రోడ్లపై పార్కింగ్ చేయకుండా చూడాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. దైవ దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా బారికేడింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. విద్యుత్ అంతరాయం లేకుండా, జనరేటర్‌లను అందుబాటులో ఉంచుకోవా లని సంబం ధిత అధికారులను కోరారు.
23వ తేదీన జరిగే మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రతి శాఖ సమన్వయంతో పని చేయాలని అధికా రులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్‌పీసిఈ ఓ శోభారాణి, భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి , ఏ సి పి రమేష్,మండల తహసీల్దార్ లు , ఎంపీడీవో లు , మున్సిపల్ కమిషనర్లు , సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.