హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో దర్శనం చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. తన జన్మదినం సందర్భంగా సీఎం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టెంపుల్ అభివృద్ధిపై అధికారులతో చర్చించనున్నారు. అనంతరం మూసీ పునరుజ్జీవన సంకల్ప పాదయాత్ర చేయనున్నారు. రెండున్నర కిలో మీటర్ల మేర మూసీ యాత్ర కొనసాగనుంది. రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.