calender_icon.png 14 November, 2024 | 10:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలమూరుకు అన్యాయం జరిగింది: సీఎం రేవంత్

10-11-2024 02:08:23 PM

సీఎం అయ్యే అవకాశం వచ్చిందటే కురుమూర్తిస్వామి దయ

పాలమూరులో ఇంకా వలసలు 

పాలమూరు ప్రజల ఓట్ల వేస్తే కేసీఆర్ సీఎం అయ్యారు

హైదరాబాద్: కురుమూర్తిస్వామిని దర్శించుకుంటే తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నట్లేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలకు కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి  ఆదివారం నాడు మహబూబ్ నగర్ లో పర్యటిస్తున్నారు. కురుమూర్తిస్వామి దర్శించుకున్న రేవంత్ రెడ్డి స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  సీఎం వెంట మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజనర్సింహ, ఇతర నేతలు ఉన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. పాలమూరు బిడ్డకు సీఎం అయ్యే అవకాశం వచ్చిందంటే కురుమూర్తిస్వామి దయ.. పేదల తిరుపతిగా కురుమూర్తిస్వామిని కొలుస్తారు. ఇప్పటికీ కురుమూర్తి ఆలయంలో మౌళిక సదుపాయాలు లేవన్నారు. అందుకే రూ. 1.10 కోట్లతో ఘాట్ రోడ్ కారిడార్ నిర్మిస్తున్నామని తెలిపారు. కురుమూర్తి ఆలయానికి ఏం కావాలో కలెక్టర్ నివేదిక ఇస్తే నిధులు ఇస్తామని పేర్కొన్నారు.

దేశంలో ఏ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలోనైనా పాలమూరు ప్రజలు కృషి ఉంటుందని సీఎం హర్షం వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో మాత్రం గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టులు పూర్తి కాలేదని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో పాలమూరుకు పరిశ్రమలు, ప్రాజెక్టులు రాలేదు.. పాలమూరులో ఇంకా వలసలు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాలో పచ్చని పంటలు పండాలని ఆకాంక్షించారు. మక్కల్, నారాయణపేట్, కొడంగల్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం, మక్కల్, నారాయణపేట్, కొడంగల్ ప్రాంతాలకు కృష్ణా జలాలను తీసుకువస్తామని సీఎం స్పష్టం చేశారు. పాలమూరు అభివృద్ధిని కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారు. పాలమూరుకు అన్యాయం జరిగిందని సీఎం తెలిపారు. పాలమూరు బిడ్డనై ఉండి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే ప్రజలు క్షమించరని పేర్కొన్నారు. పాలమూరు ప్రజలు ఓట్లు వేస్తేనే కేసీఆర్ రెండు సార్లు సీఎం అయ్యారు. 12 మంది ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలు, ఒక సీఎంను పాలమూరు ఇచ్చిందని తెలిపారు.