calender_icon.png 16 March, 2025 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టేషన్‌ ఘన్‌పూర్‌లో సీఎం పర్యటన... పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

16-03-2025 02:57:23 PM

జనగామ,(విజయక్రాంతి): జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం పర్యటించారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ శివునిపల్లిలో ప్రజాపాలన సభాకి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సభా ప్రాంగణలో మహిళా సంఘాల స్టాళ్లను పరిశీలించిన రూ.800 కోట్ల ప్రగతి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టారు. పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి, 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి రూ.46 కోట్లు, ఇంటిగ్రేటెడ్ డివిజినల్ ఆఫీస్ కాంప్లెక్స్ కు రూ.26 కోట్ల, పంచాయతీ రాజ్ బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.38 కోట్లు, స్టేషన్‌ ఘన్‌పూర్‌లో నిర్మించే డిగ్రీ కళాశాలకు రూ.5 కోట్లు వేచించారు.

స్టేషన్‌ ఘన్‌పూర్‌ గ్రామ పంచాయితీని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేస్తూ, మారుమూల తండాలకు రోడ్లు, బంజారా భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మహిళా శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులు, బ్యాంకు లింకేజ్ లోన్ లు ప్రారంభించారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌లోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి, ఐదు సబ్ స్టేషన్లు, డివిజన్ ఆఫీసు నిర్మాణానికి, ఐదు వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సీఎ రేవంత్ రెడ్డి శంకుస్థాప చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మంత్రి కొండా సురేఖ, మంత్రి సీతక్క, ఎంపీ కడియం కావ్య తదితరులు పాల్గొన్నారు.