calender_icon.png 26 December, 2024 | 10:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముఖ్యమంత్రికి స్వాగతం తెలిపిన మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

25-12-2024 11:34:46 PM

పాపన్నపేట,(విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి పాపన్నపేట మండలానికి విచ్చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కనీవినీ రీతిలో స్వాగతం తెలిపాయి.  కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు  పబ్బతి ప్రభాకర్ రెడ్డి, మండల అధ్యక్షులు గోవింద్ నాయక్, సీనియర్ నాయకులు ప్రశాంత్ రెడ్డిల నేతృత్వంలో మండల వ్యాప్తంగా కార్యకర్తలు సీఎంకు స్వాగతం తెలిపేందుకు ఏడుపాయలకు బారులు తీరారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఏడుపాయలతో పాటు మండల వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం నిధులను కేటాయించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు.

మండలంలోని పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అప్గ్రేడ్ చేయడంతో పాటు నూతన భవన నిర్మాణానికి, మంబోజి పల్లి నుండి బొడ్మట్ పల్లి వరకు 4 వరుసల రహదారి నిర్మాణానికి, ఏడుపాయలల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా సత్రాల ఏర్పాటు అలాగే మరుగుదొడ్లు, స్థాన ఘట్టాలు,  దుస్తులు మార్చుకునేందుకు సరైన వసతి నిర్మాణాలు, అమ్మవారి గుడి ముందు నుంచి పారే నదీపాయకు సిమెంట్ లైనింగ్ కొరకు  నిధులు మంజూరు చేయాలని  మరియు గణపురం ప్రాజెక్టు ఎత్తు పెంపుకు సంబంధించిన నిధులు విడుదల చేయడం తో పాటు మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల అభివృద్ధికి సంబంధించి పలు రకాల పనులకు సంబంధించిన నిధులను మంజూరు చేయాలని ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు.  ఈ సందర్భంగా కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి కి నాగలిని బహుకరించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.