పాపన్నపేట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే మెడికల్ కాలేజ్ నిర్మాణానికి 20 ఎకరాల స్థలంతోపాటు రూ.250 కోట్లు కేటాయించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. బుధవారం ఏడుపాయల వనదుర్గ భవాని మాత దర్శనానికి వచ్చిన ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా పలు పనులకు సంబంధించి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని సమర్పించారు. దుబ్బాక నియోజకవర్గం లోని అబ్సిపూర్ చౌరస్తా నుండి దుబ్బాక అంబేద్కర్ చౌరస్తా వరకు నాలుగు వరసల రోడ్డు నిర్మాణానికి 20 కోట్లు మంజూరు చేయాలని, శిలాజి నగర్ నుండి ఇనుగుర్తి వరకు బొప్పాపూర్ మీదుగా వెళ్లే రహదారి నిర్మాణానికి 40 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.