హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపల్లి జిల్లాలో బుధవారం పర్యటిస్తున్నారు. యువ వికాసం పేరిట పెద్దపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వం సభ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి 9 వేల మందికి నియామక పత్రాలు అందజేయనున్నారు. స్కిల్ వర్సీటీ భాగమయ్యే సంస్థలతో ఒప్పందాలపై సంతకాలు చేశారు. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్, సీఎం కప్ ను ప్రారంభించనున్నారు. బస్ డిపో, పెద్దపల్లి- సుల్లానాబాద్ బైపాస్ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. కొత్తగా మంజూరైన పోలీస్ స్టేషన్లు సీఎం ప్రారంభించనున్నారు. మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.