calender_icon.png 19 April, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల ఆశలపై నీళ్లు చల్లిన సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

09-04-2025 01:18:26 AM

  1. భద్రాద్రి పట్టణ సమస్యలపై నోరు విప్పని ముఖ్యమంత్రి 
  2. సమస్యలపై ప్రస్తావించని అసమర్థ ప్రజా ప్రతినిధులు
  3. ప్రశ్నిస్తారనే సిపిఎం కార్యకర్తల అక్రమ అరెస్టులు
  4. సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు.

భద్రాచలం, ఏప్రిల్ 8 (విజయ క్రాంతి)  భద్రాచలం పట్టణ సమస్యలపై ప్రకటన చేస్తారని ఎదురు చూసిన పట్టణ ప్రజల ఆశలపై ముఖ్యమంత్రి నీళ్లు చల్లారని సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు.

మంగళవారం భద్రాచలంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భద్రాద్రి అభివృద్ధి పై గత ప్రభుత్వం చూపిన వివక్షతే నేడు కాం గ్రెస్ ప్రభుత్వం కొనసాగించిందని, భద్రాద్రి అభివృద్ధి పై ముఖ్యమంత్రి నోరు విప్పకపోవటం దుర్మార్గమని అన్నారు.

 శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణానికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు తీసుకువచ్చే ఆనవాయితీని కొ నసాగించిన ముఖ్యమంత్రి ని స్వాగతిస్తున్నామని, సన్న బియ్యం పథకాన్ని ప్రారంభిస్తూ

 ఓ గిరిజన కుటుంబంలో భోజనం చేయడాని అభినందిస్తున్నామని మచ్చా వెంకటే శ్వర్లు అన్నారు. అదే సందర్భంలో గత ముఖ్యమంత్రి మాదిరిగానే భద్రాచలం అభివృద్ధి పట్ల ఎటువంటి ప్రకటన చేయకుండా వివక్షతను ప్రదర్శించడం సరైనది కాదని విమర్శించారు. భద్రాచలం పట్టణ సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లలేని అసమర్ధ  ప్రజాప్రతినిధులు ఉండడం ప్రజ ల దౌర్భాగ్యమన్నారు.

శ్రీరామనవమికి వారం రోజులు ముందుగానే సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ సమస్యలపై ఆందోళనలు, నిరాహార దీక్షలు నిర్వహించి ముఖ్య మంత్రి దృష్టికి సమస్యలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రభుత్వం, పోలీసులు అక్రమ అరెస్టులు చేసి అడ్డుకోవడం అప్రజా స్వామికమైన చర్యని అన్నారు.

పోలవరం బ్యాక్ వాటర్ తో గోదావరి ముంపు నుండి భద్రాచలం పట్టణ రక్షణకు శాశ్వత పరిష్కారం చూపకుండా బిజెపి ప్రభుత్వం మోసం చేసింది. దక్షిణ అయోధ్య గా పేరుగాంచిన భద్రాచాలాన్ని కావాలనే ప్రభుత్వాలు పట్టించుకుకోటం లేదని విమర్శించ్చారు.

ఐదు పంచాయతీలను భద్రాచ లంలో కలిపేందుకు  ప్రకటన చేస్తారని ఎదురుచూసిన ప్రజల ఆశలపై ముఖ్యమంత్రి నీళ్లు చల్లారన్నారు. నాలుగు రాష్ట్రాల సరిహద్దుగా భద్రాచలం ఏజెన్సీ కేంద్రంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం భద్రాచలం పట్ల కక్షపూరిత ధోరణిని ప్రదర్శి స్తుందని పోలవరం ముంపు సమస్యతోపాటు  ఐదు పంచాయతీల సమస్యపై ము ఖ్యమంత్రి బాధ్యత తీసుకొని కేంద్రం వద్దకు అఖిలపక్షంను తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.

రామాలయం అభివృద్ధితో పాటు భద్రాచలం పట్టణాభివృద్ధి కి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ,భ ద్రాచలం ఏజెన్సీ కేంద్రంగా న్యాయ కళాశాలతో పాటు, స్పోరట్స్ స్కూల్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పి.సంతోష్ కుమార్,డి సీతాలక్ష్మి లు పాల్గొన్నారు.