calender_icon.png 8 January, 2025 | 2:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిష్టాత్మకంగా నిర్వహించండి

07-01-2025 01:17:38 PM

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో  నిర్వహిస్తున్న జాతీయ హ్యాండ్ బాల్ క్రీడలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి(MLA Yennam Srinivasa Reddy)తో కలిసి ఈనెల 10వ తేదీన జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో ప్రారంభం కానున్న 68వ ఎస్జిఎఫ్ అండర్-17 బాల, బాలికల జాతీయ హ్యాండ్ బాల్ పోటీల పోస్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, అన్ని రంగాల్లో ముందు స్థాయిలో ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్ బాల్  అసోసియేషన్ అధ్యక్షులు పి.రజినీకాంత్(Handball Association President P. Rajinikanth), కార్యదర్శి డా. జియావుద్దీన్, ఫిజికల్ డైరెక్టర్లు బాలరాజు, ఫరూక్ ముకరం తదితరులు పాల్గొన్నారు.