29-03-2025 06:00:05 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ భరోసా పథకం అమలు చేస్తుంది. అయితే ప్రవాసీ మిత్ర సంస్థ "రేవంత్ సర్కారు-గల్ఫ్ భరోసా" పేరుతో రూపొందించిన పోస్టర్, డాక్యుమెంటరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు. గల్ఫ్ కార్మికుల సామాజిక భద్రత కోసం వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చొరవ నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీ రూపొందించబడింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈ.అనిల్, ప్రవాసి మిత్ర ప్రతినిధులు మంద భీమ్ రెడ్డి, పీ.సునీల్ కుమార్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాసరావు, పీఎల్కే రెడ్డి, కళ్యాణ్ కుమార్, జబ్బార్ తదితరులు పాల్గొన్నారు.