23-02-2025 01:50:48 PM
యాదాద్రి,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం(Yadagirigutta Lakshmi Narasimha Swamy Temple)లో విమాన గోపురం బంగారు తాపాన్ని ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. యాదగిరిగుట్ట ఆలయంలో దివ్యవిమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేక మహోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. స్వర్ణమయంగా మారిన దివ్యవిమాన గోపురం స్వర్ణతాపడం కోసం రూ.80 కోట్లు ఖర్చు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. యాదగిరిగుట్ట ఆలయం దేశంలోనే టీటీడీ 33 అడుగుల నిర్మాణంతో పోలిస్తే బంగారు పూతతో 55 అడుగుల ఎత్తైన విమాన గోపురంగా నిలవనుంది.