హైదరాబాద్: తెలంగాణ డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ఈ విగ్రహావిష్కరణలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్న ప్రభాకర్, శ్రీధర్ బాబు, రాజనర్సింహ, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, పాల్గొన్నారు.