calender_icon.png 19 January, 2025 | 7:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగపూర్ నదిలో తెలంగాణ సీఎం పడవ ప్రయాణం

19-01-2025 03:19:45 PM

హైదరాబాద్: తెలంగాణ(Telangana) సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ నదిలో పడవ ప్రయాణం(Revanth Reddy boat trip on Singapore River) చేశారు. అక్కడి నది పునరుద్ధరణ కార్యక్రమాలను పరిశీలించారు. హైదరాబాదులో నదుల సంరక్షణ, అభివృద్ధికి ఉత్తమ పద్ధతులు అమలు చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన జరిగింది. సింగపూర్ నదిపై పడవ ప్రయాణం చేసి, సిటీ-స్టేట్ అవలంబిస్తున్న ఉత్తమ పద్ధతులు, నది పునరుజ్జీవనంపై దాని చారిత్రక ప్రయత్నాలు, నీటి నిర్వహణలో పురోగతులు, వారసత్వ భవనాల పునరుద్ధరణ, పరిరక్షణలో ప్రయత్నాలు, అద్భుతమైన కొత్త ఐకానిక్ భవనాలు, కార్యాలయాలు, నివాసాలు, పట్టణ మౌలిక సదుపాయాలను సీఎం రేవంత్  రెడ్డి పరిశీలించారు.  ప్రపంచ స్థాయి హైదరాబాద్‌(Hyderabad)ను రూపొందించడానికి మనం ఇంకా ఉత్తమ పద్ధతులను నేర్చుకోవాలంటూ ఎక్స్ లో పోస్టు చేశారు.