02-03-2025 10:54:16 AM
హైదరాబాద్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం వనపర్తిలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో వనపర్తి వెళ్లనున్నారు. మొదట ఉదయం 11.30 గంటలకు శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసి, ఆ తర్వాత ఆలయ అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక జడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించి చిన్ననాటి స్నేహితులను కలవనున్నారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో రేవంత్ రెడ్డి సమావేశమై వనపర్తి జిల్లాలో స్వయం ఉపాధి పథకాన్ని మధ్యాహ్నం 2.15 గంటలకు రాష్ట్ర మైనారిటీ ఫైనాస్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి వనపర్తిలో ఏర్పాటు చేసిన రుణ మేళా, ఉద్యోగ మేళాల పాల్గొంటారు. సాయంత్రం 4.15 గంటలకు వనపర్తి నుంచి నేరుగా నాగర్ కర్నూల్ జిల్లాలోని ఎస్ఎల్సబీసీ టన్నెల్ కు వెళ్లనున్నటు సమాచారం.