హైదరాబాద్, జనవరి 15 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యట నకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నెల 17 నుంచి 24 వరకు ఆయన విదేశాల్లో పర్యటించనున్నారు. ఈమేరకు సీఎం షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈ నెల 16న రాత్రి 9.50 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి బయలు దేరి 17న ఉదయం 6 గంటలకు సింగపూర్‌లోని చాంగీ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
సింగపూర్‌లో మూడు రోజుల పర్యటన అనంతరం, ఈ నెల 20న తెల్లవారుజామున సింగపూర్ నుంచి బయలుదేరి జూరిచ్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ రెండు రో జుల పాటు దావోస్ సదస్సులో సీఎం పాల్గొననున్నారు. జూరిచ్ పర్యటన అనంతరం 23న రాత్రి దుబాయ్‌కి వెళ్లనున్నారు. దుబాయ్‌లో ఒక రోజు పర్య టన తర్వాత 24న ఉదయం 8.25 గంటలకు హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.