calender_icon.png 2 April, 2025 | 3:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏప్రిల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి జపాన్ పర్యటన

25-03-2025 12:14:48 AM

  1. ఒసాకాలో జరిగే వరల్డ్ ఎక్స్‌పోకు హాజరు
  2. ఆయన వెంట వెళ్లనున్న ఐటీమంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జపాన్ పర్యటన ఖరారైంది. ఏప్రిల్ రెండో వారంలో సీఎం రేవంత్‌రెడ్డి వారంపాటు జపాన్‌లో పర్యటించనున్నారు. ఒసాకాలో జరిగే వరల్డ్ ఎక్స్‌పో2025లో రాష్ట్ర బృందంతో కలిసి పాల్గొననున్నారు. ఏప్రిల్ 13న మొదలుకానున్న ఈ పర్యటనలో మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులు సీఎంతో పాటు వెళ్లనున్నారు. బీఐఈ అనే సంస్థ ప్రతీ పదేండ్లకోసారి ప్రపంచ ఎక్స్‌పోలు నిర్వహిస్తోంది. ఆరునెలల పాటు ఈ ఎక్స్‌పో జరుగునుంది.