calender_icon.png 25 February, 2025 | 2:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడే ఉస్మానియా ఆసుపత్రికి భూమి పూజ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

31-01-2025 09:44:38 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): గోషామహల్ లోని ఉస్మానియా ఆసుపత్రి(Osmania Hospital)కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇవాళ ఉదయం 11.54 గంటలకు సీఎం ఉస్మానియా ఆసుపత్రి  కొత్త భవనానికి భూమిపూజ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం అవుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka), రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(State Medical and Health Minister Damodar Rajanarsimha) హజరుకానున్నారు.

ప్రస్తుతం అఫ్జల్ గంజ్ లో ఉన్న ఉస్మానియా ఆసుపత్రిని అత్యాధునికి వైద్య సౌకర్యాలతో గోషామహల్ స్టేడియంలో 2 వేల పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసుపత్రి నూతన భవన పునర్ నిర్మాణం చేస్తున్నట్లు సమాచారం. రాబోయే వందేళ్లు అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రూ.2700 కోట్ల వరకు వ్యయం వేచించి నిర్మిస్తున్న కొత్త భవనం ప్రారంభోత్సవం తర్వాత 20 శాతం వైద్యుల సంఖ్య పెరుగనుంది. రోజూ 5 వేల మంది ఓపీ రోగులను చూసేలా ఏర్పాట్లు, 30 విభాగాలలో రోబోటిక్ సర్జరీలు చేపట్టే విధంగా సౌకర్యాలు చేస్తున్నారు. 


సీఎం రేవంత్‌రెడ్డి నేటి షెడ్యూల్‌..

ఉదయం 11.54 గంటలకు గోషామహల్‌లో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనానికి శంకుస్థాపన కార్యక్రమం,  3.30 గంటలకు రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద హైస్కూల్ 150వ వార్షికోత్సవ వేడుకలు, సాయంత్రం 5.45 గంటలకు రవీంద్రభారతిలో గద్దర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొననున్నారు.