calender_icon.png 22 February, 2025 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాంపల్లి కోర్టుకు సీఎం రేవంత్‌రెడ్డి

21-02-2025 01:25:50 AM

  • ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై కేసులు

మార్చి 23కు కేసు వాయిదా

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు సీఎం రేవంత్‌రెడ్డి గురువారం హాజరయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మాజీ సీఎం కేసీఆర్, నాటి ప్రభుత్వంపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదుతో వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

ఆ కేసుల విచారణలో భాగంగా నాంపల్లి కోర్టు ఎదుట ఆయన హాజరయ్యారు. ఈ కేసు మార్చి 23కు వాయిదా పడింది. నల్గొండ జిల్లా టూ టౌన్, హైదరాబాద్ జిల్లా బేగం బజార్, మెదక్ జిల్లా కౌడిపల్లి తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో రేవంత్‌రెడ్డిపై దాదాపు తొమ్మిది కేసులు నమోదయ్యాయి.