రెండు రోజులపాటు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం
హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాం తి): మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి వెళ్లనున్నారు. చంద్రాపూర్‌లో జరిగే ప్రచారంలో పాల్గొనేందుకు శనివారం ఉదయం ఆయన హైద రాబాద్ నుంచి బయలుదేరి నాగ్‌పూర్ వెళ్లనున్నారు. చంద్రాపూర్‌లో స్థానిక నేతలతో కలిసి రేవంత్‌రెడ్డి ప్రచారంలో పాల్గొంటారు.
అనంతరం రాజురా, డిగ్రాస్, వార్ధా నియోజకవర్గాల్లోనూ ప్రచార సభలు, రోడ్‌షోలలో పాల్గొని తిరిగి నాగ్‌పూర్ చేరుకుంటారు. ఆదివారం ఉదయం నాగ్‌పూర్ నుంచి నాం దేడ్ చేరుకుని నయాగావ్, భోకర్, షోలాపూర్ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. దాదాపు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు, తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో సీఎం రేవంత్ ప్రచారం నిర్వహించనున్నారు.