హైదరాబాద్: ''రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం'' పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ప్రజాభవన్ లో ప్రారంభించారు. సివిల్స్ మెయిన్స్ కు ఎంపికైన ఒక్కో అభ్యర్థికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం చేకూరనుంది. సివిల్స్ మెయిన్స్ కు ఎంపికైన రాష్ట్ర అభ్యర్థులకు సింగరేణి ద్వారా ఆర్థిక సాయం ఆర్థిక సాయానికి ప్రభుత్వం కొత్త పథకం ప్రారంభించింది. ఈ సందర్భంగా సివిల్స్ మెయిన్స్ కు ఎంపికైన రాష్ట్ర అభ్యర్థులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. సివిల్స్ ప్రిమిల్స్ లో తెలంగాణ నుంచి 41 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ కార్యక్రమానికి సింగరేణి సీఎండీ బలరాం హాజరయ్యారు.