14-04-2025 08:59:31 AM
హైదరాబాద్,(విజయక్రాంతి): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం భూభారతి చట్టాన్ని, పోర్టల్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించునున్నారు. రాష్ట్రంలో అందరి భూములకు భద్రత, భరోసా కల్పించడమే ప్రధాన ధ్యేయంగా భూభారతి చట్టాన్ని, భూభారతి పోర్టల్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఇవాళ సాయంత్రం 5 గంటలకు భూభారతి చట్టాన్ని, పోర్టల్‌ను ముఖ్యమంత్రి తొలుత మూడు మండలాల్లో భూభారతి ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. జూన్ 2వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు స్వీకరించాలని సీఎం స్పష్టీకరణ చేశారు. ప్రజల నుంచి వచ్చిన స్పందన మేరకు ఎప్పటికప్పుడు పోర్టల్ అప్ డేట్ అవుతుందని నిన్న రేవంత్ రెడ్డి నివాసంలో అధికారుల సమావేశంలో తెలిపారు. ప్రజల భూములకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
అలాగే రాష్ట్రంలో నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలుకానుంది. డాక్లర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజును ఎస్సీ వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ ఉత్తర్వులు, విధివిధానాలను జారీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన జీవో తొలికాపీని సీఎం రేవంత్ రెడ్డికి మంత్రివర్గ ఉపసంఘం అందించనుంది.