calender_icon.png 17 January, 2025 | 12:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

13న జేఎన్టీయూకు సీఎం రేవంత్‌రెడ్డి

11-07-2024 02:31:53 AM

గోల్డెన్ జూబ్లీ భవన ప్రారంభం

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): ఈనెల 13న సీఎం రేవంత్ రెడ్డి జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీకి వెళ్లనున్నారు. యూనివర్సిటీలో నిర్మించిన గోల్డెన్ జూబ్లీ భవనాన్ని  ప్రారంభిస్తారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమ అనంతరం జేఎన్టీయూ ఆడిటోరియంలో నిర్వహించే సభలో సీఎం మాట్లాడనున్నారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) అధికారులతో సీఎం సమావేశం కానున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ విభాగం, దాని అభివృద్ధి, సమాజంపై దాని ప్రభావం ఎలా ఉంటుందనే  విషయంపై ఆయా విభాగాల అధికారులతో సీఎం చర్చించనున్నట్లు తెలుస్తోంది.