calender_icon.png 10 January, 2025 | 11:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

26 తర్వాత జిల్లాల్లో పర్యటిస్తా: సీఎం రేవంత్

10-01-2025 07:32:11 PM

జిల్లాల్లో పర్యటిస్తా

సాగు యోగ్యమైన భూములకే రైతభరోసా

హైదరాబాద్: కలెక్టర్లతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 26 తర్వాత జిల్లాల్లో పర్యటిస్తానని సీఎం స్పష్టం చేశారు. అన్ని జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తానని తెలిపారు. సాగు యోగ్యమైన భూములకు రైతుభరోసా చెల్లించాలని, సాగుకు అక్కరకు రాని భూములకు మాత్రమే ఇవ్వకుడదని ఆదేశించారు. సాగుయోగ్యం కాని భూములు గుర్తించి రైతు భరోసా(Rythu Bharosa) నుంచి మినహయించాలని సీఎం తెలిపారు.

రైతు పంట వేసినా.. వేయకున్నా.. సాగుయోగ్యమైన భూమికి రైతుభరోసా ఇవ్వాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. సాగు యోగ్యం కాని భూముల వివరాలు పక్కాగా తయారు చేయాలని సూచించారు. స్థిరాస్తి భూములు, లే ఔట్ ల వివరాలను ముందుగా సేకరించాలని సూచించారు. నాలా కన్వర్షన్ అయిన భూముల వివరాలు, మైనింగ్ భూములు, గోదాములు నిర్మించిన భూములు, వివిధ ప్రాజెక్టులకు సేకరించిన భూముల వివరాలు సేకరించాలని సీఎం ఆదేశించారు. గ్రామ పంచాయతీ, మున్సిపాాలిటీల రెవెన్యూ రికార్డులు క్రోడీకరించుకోవాలని సూచించారు. గ్రామాల మ్యాపులు పరిశీలించి క్షేత్రస్థాయిలో పరిశీలించి ధ్రృవీకరించుకోవాలని తెలిపారు.