ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బేగంపేట నుంచి దమగ్న పూర్
దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తండ్రి దశదినకర్మకు హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి
దేవరకద్ర : మహబూబ్నగర్ జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం రానున్నారు. దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తండ్రి గవినోల్ల కృష్ణారెడ్డి దశదినకర్మ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి దేవరకద్ర నియోజకవర్గంలోని దమగ్నపూర్ గ్రామానికి రానున్నారు. హైదరాబాదులోని బేగంపేట నుంచి హెలికాప్టర్ ద్వారా నేరుగా దమగ్నపుర్ చేరుకోనున్నారు. ఆదివారం ఉదయం 11:30 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 12:10 నిమిషాలకు దేవరకద్ర నియోజకవర్గంలో సీసీ కుంటమండల పరిధిలోని దమగ్న పూర్ గ్రామానికి చేరుకుంటారు. ఒంటి గంట వరకు అక్కడే ఉండి అనంతరం నేరుగా దమగ్నపుర్ నుంచి హెలికాప్టర్ ద్వారా తిరిగి బేగంపేటకు చేరుకుంటారు. ఈ మేరకు సీసీ గుంట మండల పరిధిలో నిధమజ్ఞాపూర్ గ్రామంలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.