calender_icon.png 5 October, 2024 | 8:52 AM

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

05-10-2024 02:26:22 AM

ఎల్లుండి జరిగే హోంమంత్రుల సమావేశానికి హాజరు 

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరిగే రాష్ట్ర హోంశాఖ మంత్రులతో జరిగే సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. అంతకు ముందు రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కలిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి మరోసారి సమగ్ర నివేదికను సీఎం రేవంత్‌రెడ్డి అందించనున్నారు.

ఈ సమావేశం తర్వాత పార్టీకి చెందిన ఢిల్లీ పెద్దలను కూడా కలవనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, తెలంగాణలో సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు వరదలు రావడంతో దాదాపు రూ.10 వేల కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది, కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో పర్యటించింది.

తక్షణ సాయం కింద  కేంద్రం తెలుగు రాష్ట్రాలకు రూ.3,300 కోట్లు విడుదల చేసింది. ఇటీవల కేంద్రం మళ్లీ 14 రాష్ట్రాలకు రూ.5,858 కోట్లను విడుదల చేసింది, అందులో తెలంగాణకు కేవలం రూ. 416.80 కోట్లు మాత్రమే కేటాయించారు. కేంద్రం తెలంగాణకు అరకొర సాయం ప్రకటించడంతో సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి కేంద్రానికి నివేదిక ఇవ్వడానికి ఢిల్లీ వెళ్లనున్నారు.