పీసీసీ, మంత్రివర్గ విస్తరణ,
నామినేటెడ్ పదవుల కేటాయింపుపై చర్చ
హైదరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఏఐసీసీ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతలతో పాటు ముఖ్య నాయకులు హాజరయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనలో ఉండటంతో ఆయన ఏఐసీసీ సమావేశానికి హాజరు కాలేదు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో పాటు రాష్ట్రంలో పీసీసీ కొత్త అధ్యక్షుడు, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల కేటాయింపుతో పాటు ఎమ్మెల్యేల చేరికల అంశంపై పార్టీ అధిష్ఠానంతో ఆయన చర్చించనున్నారు. కాగా గురువారం ఉదయం సీఎం రేవంత్‌రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. తొలుత పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుని సైనికుల స్మారక స్థూపానికి నివాళి అర్పిస్తారు. తర్వాత గోల్కొండ కోటకు చేరుకుని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.