సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరు
హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో శుక్రవారం జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సీడబ్ల్యూసీ సభ్యులు భేటీ కానున్నారు. తెలంగాణ నుంచి సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడిగా ఉన్న మంత్రి దామోదర రాజనరసింహ కూడా ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళ్లనున్నారు.