- ముగిసిన సింగపూర్ పర్యటన
- ప్రముఖ కంపెనీలతో తెలంగాణ బృందం భేటీ
- పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన పలు సంస్థలు
- నేటి నుంచి ప్రపంచ ఆర్థిక సదస్సు
హైదరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కూడిన తెలంగాణ రైజింగ్ బృందం దావోస్‌కు వెళ్లింది. సోమవారం ప్రారంభమయ్యే ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈ ఎఫ్)లో పాల్గొననుంది. ఆదివారం సింగపూర్‌లో మూడు రోజలు పర్యటనను విజయ వంతంగా ముగించుకుంది.
హైదరాబాద్, తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రధాన వ్యాపార సంస్థలతో పాటు సింగపూ ర్ బిజినెస్ ఫెడరేషన్(ఎఫ్‌బీఎఫ్) సభ్యులతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు ఫలవంతమైన చర్చలు జరిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, ప్రభుత్వంతో కలిసి పని చేయాడానికి పలు సంస్థ లు ముందుకొచ్చాయి.
రేవంత్‌రెడ్డి ప్రభు త్వం తెలంగాణ రైజింగ్ 2050 దార్శనికతకు పారిశ్రామికవేత్తలు ఆకర్షితులయ్యారు. ఫ్యూచర్ సిటీలో రూ.3,500 కోట్లతో అధునాతన డాటా సెంటర్, రూ.450 కోట్లతో ఐటీ పార్క్ ఏర్పాటుకు ఎస్టీటీ గ్రూప్, క్యాపిటల్ ల్యాండ్ కమిటీలు ముందుకొచ్చాయి. అలాగే సెమీకండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపా రు.
సీఎం రేవంత్‌రెడ్డి సింగపూర్‌లో కలిసిన ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఇండియన్ ఓషయన్ గ్రూప్ వ్యవస్థాపకుడు, సీఈవో ప్రదీ ప్తో బిశ్వాస్, డీబీఎస్ కంట్రీ హెడ్ లిమ్‌హిమ్ చౌన్, డీబీఎస్ టెలీకామ్ హెడ్ అమిత్ శర్మ, బ్లాక్ స్టోన్ సింగపూర్ సీనియర్ ఎండీ, చైర్మన్ గౌతమ్ బెనర్జీ, బ్లాక్‌స్టోన్ సింగపూర్ రియల్ ఎస్టేట్ సీనియర్ ఎండీ పెంగ్వీ టాన్, మెయిన్‌హార్డ్ గ్రూప్ సీఈఓ ఒమర్ షాబాద్ ఉన్నారు. కాగా ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా రాష్ట్రంలో వ్యాపార అనువైన పరిస్థితు లను తెలంగాణ రైజింగ్ బృందం పారిశ్రామికవేత్తలకు వివరించనుంది.