calender_icon.png 20 April, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జపాన్‌కు చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి బృందం

17-04-2025 02:02:12 AM

  1. స్వాగతం పలికిన ఇండియా రాయబారి శిభుజార్జ్ 
  2. ఈనెల 22 వరకు పర్యటన

హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జపాన్‌కు చేరుకున్నారు. ఎనిమిది రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరిన సీఎం రేవంత్‌రెడ్డి బృందం..బుధవారం జపాన్‌లోని నారిటా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నది. జపాన్‌లోని భారతదేశ రాయబారి శిభుజార్జ్ వారికి స్వాగతం పలికారు.

సీఎం రేవంత్‌రెడ్డి బృందంతో పాటు తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ కనిమోళి, మాజీ ఎంపీ నెపోలియన్, అధికారులకు ఆయన డిన్నర్ ఇచ్చారు. ఈనెల 22 వరకు సీఎం రేవంత్‌రెడ్డి జపాన్‌లోని టోక్యో, మౌంట్ పుజి, ఒసాకా, హిరోషిమాలో పర్యటించనున్నారు. అలాగే ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్‌పోలో సీఎం పాల్గొననున్నారు.

అనంతరం టోక్యోలోని పెట్టుబడులపై పలు పారిశ్రామిక వేత్తలతో సీఎం సమావేశం జరగ నుంది. జపాన్‌లోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత అభివృద్ధి సీఎం రేవం త్‌రెడ్డి బృందం అధ్యయనం చేయనుంది.

తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ కోసం జపాన్ సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతో పాటు అభివృద్ధిలో భాగస్వా మ్యం కావాల్సిందిగా సీఎం అక్కడి పారిశ్రామికవేత్తలను, వివిధ సంస్థలను ఆహ్వానించ నున్నారు. సీఎంతోపాటు నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి, కాంగ్రెస్ నేత రోహిన్‌రెడ్డి తదితరులు పర్యటనలో ఉన్నారు.