యాదాద్రి,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవన సంకల్పయాత్రను శుక్రవారం ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి సంగెం నుంచి భీమలింగం వరకు సూమారుగా 2.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారు. మూసీ పునరుజ్జీవన యాత్రలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, భారీగా కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం మూసీ పరివాహకంలో ఉన్న శివలింగానికి సీఎం పాలాభిషేకం చేసి పూజ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి తన జన్మదినం పురస్కరించుకోని యాద్రాద్రి లక్ష్మీ నరసింహా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చాలని సీఎం ఆదేశించారు. అలాగే టీటీడీ తరహాలో యాదగిరి టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. గోశాలలో గో సంరక్షణకు ప్రత్యేక పాలసీ, కొండపై భక్తులు నిద్రించేందుకు సౌకర్యాలు కల్పించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.