calender_icon.png 1 January, 2025 | 3:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'కాటమయ్య రక్ష కిట్ల' పంపిణీ పథకం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

14-07-2024 02:05:21 PM

హైదరాబాద్: గీతకార్మికులకు 'కాటమయ్య రక్ష' కిట్ల పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఆధునిక టెక్నాలజీతో సేఫ్టీ కిట్లను హైదరాబాద్ ఐఐటీ తయారుచేసింది. గీతకార్మికులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి బోజనం చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డ ప్రసాద్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం గీతకార్మికుల సాధకాలను అడిగి తెలుసుకున్నారు. తాటి వనాల పెంపును ప్రోత్సహించాలని గీత కార్మికులు సీఎంను కోరారు. గ్రామంలో 5 ఎకరాలు కేటాయించాలని కోరారు. తాటి వనాలకు వెళ్తేందుకు మోపెడ్లు ఇవ్వాలన్నారు. రియల్ ఎస్టేట్ పెరగడంతో తాటివనాలు తగ్గాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. వనమహోత్సవంలో భాగంగా తాటి చెట్లు పెంపకాన్ని పరిశీలిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. రోడ్ల పక్కన తాటి చెట్లు నాటాలనే నిబంధన విధిస్తామని సూచించారు.