24-03-2025 12:15:36 AM
గద్వాల, మార్చి 23 ( విజయక్రాంతి): పేదింటి ఆడపడుచులకు అండగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని పలు మండల గ్రామాలకు చెందిన 900 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ....
కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ పేద ఇంటి ఆడపడుచులకు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి గద్వాల అభివృద్ధి సాధ్యం కావడం జరిగింది. ఇదేవిధంగా అభివృద్ధి కొనసాగాలని గద్వాల నియోజకవర్గం అన్ని రంగాలలో రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో ఉండేవిధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
కొందరు కళ్యాణ లక్ష్మి చెక్కు లు రావు అని ప్రజలకు అపోహ కల్పిస్తున్నారు అలాంటివి ఏమీ లేవు ప్రతి ఒక్కరు కళ్యాణ లక్ష్మి చెక్కులకు నమోదు చేసుకోవాలి ప్రతి ఒక్క మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ,షాదీమూరక్ చెక్కులను అందిస్తామనన్నారు.
మహిళలు ఈ కళ్యాణలక్ష్మి, డబ్బులను వృధా చేయకుండా అవసరానికి వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, జిల్లా సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.