15-03-2025 02:58:58 PM
ప్రధాని మోదీ.. రాష్ట్రాల సీఎంలకు పెద్దన్నలాంటి వారే
కేసీఆర్ చెప్పినవి పాటిస్తాం..
ప్రజలే మా బాసులు.. ప్రజలకు నేను జవాబుదారి
కేసీఆర్ కు ఉన్నంత వయసు, అనుభవం నాకులేదు
హైదరాబాద్: కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లు.. దావత్ లు ఇచ్చే దోస్తులేనా బీఆర్ఎస్ కు కావాల్సింది.. తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి బీఆర్ఎస్(Bharat Rashtra Samithi)కు పట్టదా?, నోటీఫికేషన్లు ఇచ్చామని చెప్పుకుంటున్న వాళ్లు పదేళ్లలో ఎందుకు ఉద్యోగాలను భర్తీ చేయలేదు అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా ప్రసంగించారు. దేశ చరిత్రలోనే 57,924 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మా కాంగ్రెస్ ప్రభుత్వానిదిని సీఎం స్పష్టం చేశారు. వాళ్ల హయాంలో 22.9 శాతం ఉన్న నిరుద్యోగ సమస్యను 18.1 శాతానికి తగ్గించిన చరిత్ర తమదన్నారు. కేసీఆర్ సభలో ఉండి వారి అనుభవంతో సూచనలు ఇస్తే అభ్యంతరం లేదన్నారు.
ప్రధాని మోదీ.. రాష్ట్రాల సీఎంలకు పెద్దన్నలాంటి వారే
ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) రాష్ట్రాల సీఎంలకు పెద్దన్న లాంటి వారేనని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. ప్రధాని, కేంద్రమంత్రివర్గ నిర్ణయాలు.. రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగపడుతోందన్నారు. నేను ప్రధానిని కలవడంతో రాజకీయమేముందన్న సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలకు వచ్చినప్పుడు నేను కాంగ్రెస్ నేతను ఆయన బీజేపీ నాయకుడు అన్నారు. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించాలని తెలిపారు. రాష్ట్రప్రయోజనాల కోసమే ప్రధానిని కలిశానని మరోసారి చెప్పారు. ప్రధానిని గౌరవించే విజ్జత మాది.. ఢిల్లీ పర్యటన పేరుతో దుబారా చేయట్లేదని ముఖ్యమంత్రి వివరించారు. అవసరమైతే మహేశ్వర్ రెడ్డి తీసుకుని ఢిల్లీ వెళ్తాం, కిషన్ రెడ్డిని నాలుగుసార్లు కలిశాం, నిర్మలసీతారామన్, అమిత్ షాను కూడా కలిశామన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు జీరో పన్ను శాతం చేశామని సీఎం తెలిపారు. చెరువులు,కుంటలను మాయం చేశారు, చెరువులు, కుంటలను పునరుద్ధరించాలని చూస్తే గగ్గోలు పెడుతున్నారని ఆరోపించారు. అపార్టుమెంట్లకు తగినట్లు డ్రెయినేజీ వ్యవస్థ ఉందా? అని ప్రశ్నించారు. కమీషన్లు తీసుకుని నగరాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. లెక్క లెకుండా అనుమతులిచ్చి గందరగోళం చేశారని చెప్పారు.
ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ(Future City Development Authority) ఏర్పాటు చేశాం, ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నగరాన్ని నిర్మించాలని చూస్తే అడ్డుంపడుతున్నారని ద్వజమెత్తారు. పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామంటే అడ్డుపడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ సలహాలు సూచనలు ఇస్తే పాటించేందుకు సిద్ధంగా ఉన్నాం.. అనుభవం ఉన్న వ్యక్తిగా ఆయన చెప్పినవి పాటిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. అప్పులు పెండింగ్ పెట్టి పారిపోతే మేము కట్టుకుంటున్నాం.. వాళ్లు పెట్టిన అప్పులకు వడ్డీలు కట్టడమే భారంగా ఉందన్నారు. అప్పులు పెట్టింది కాకుండా తిరిగి మాపైనే విమర్శలు చేస్తున్నారు. డిస్కంలకు, సింగరేణి, కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయారు. రూ. 8 లక్షల కోట్లు అప్పులు మాపై వేసి పారిపోయారు. లక్షా 52 వేల కోట్లు అప్పు చేశారని మాపై బురద జల్లుతున్నారని సీఎం మండిపడ్డారు. ప్రస్తుతం తెలంగాణ అప్పు 7 లక్షల 38 వేల 707 కోట్లు ఉందని లెక్కచెప్పారు. కేసీఆర్ పరిపాలనలో తప్పులు.. అప్పులే చేశారని ఆయన ఆరోపించారు. ఈ 15 నెలల కాలమంతా కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) చేసిన అప్పులు, తప్పులు సరిచేయడానికే సరిపోయిందన్నారు. అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాన్ని నడపాలనుకోవట్లేదని సీఎం క్లారిటీ ఇచ్చారు. ప్రజలే మా బాసులు.. నన్ను సీఎం కుర్చీలో కూర్చొపెట్టిన ప్రజలకు నేను జవాబుదారి అన్నారు.కేసీఆర్ కు ఉన్నంత వయసు, అనుభవం నాకులేదు.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే నాకున్న పరిమిత జ్ఞానంతోనే చర్చిస్తానని చెప్పారు. ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ ను అసెంబ్లీకి రప్పించే శక్తి మాకు ఉందని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.