హైదరాబాద్ : గౌడన్నలు కోరినట్లు ప్రభుత్వ భూముల్లో తాటి చెట్లు, ఈత చెట్లు పెంచుతామని సీఎం తెలిపారు. ప్రాజెక్టుల వద్ద, కాలువల పక్కన తాటి, ఈత వనాలు పెంపునకు చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల వల్లే రంగారెడ్డి జిల్లాలో భూముల విలువ పెరిందన్నారు. శంషాబాద్ విమానాశ్రయం, ఓఆర్ఆర్ వల్ల రంగారెడ్డి జిల్లా భూములు విలువ పెరిగిందని రేవంత్ రెడ్డి తెలిపారు. హయత్ నగర్ వరకు త్వరలోనే మెట్రో రైల్ కూడా వస్తుందన్నారు. హయత్ నగర్ లో మెట్రో ఎక్కితే నేరుగా విమానాశ్రయం చేరుకునేలా ప్రణాళిక రూపొందించామని, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో రాష్ట్రంలో మరిన్ని మార్పులు రానున్నాయని సీఎ రేవంత్ వ్యాఖ్యానించారు.
ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకం పరిశ్రమలు వస్తాయన్నారు. రాచకొండ ప్రాంతాన్ని పర్యాటక హబ్ గా అభివృద్ధి చేస్తామని, హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చేసేలా మా ప్రణాళికలు జరుగుతున్నట్లు రేవంత్ కొనియాడారు. ఈ ప్రభుత్వ ప్రణాళికలు చూసి ఇతర పార్టీ ఎంఎల్ఏలు కూడా ముందుకు వస్తున్నారని, ఒక మంచిపని, అభివృద్ధిలో మేమూ భాగస్వాములం కావాలని, మంచి చేసే ప్రభుత్వం నిలబడాలని తమకు అండగా వస్తూ తమతో కలుస్తున్నారని సీఎం తెలిపారు. ఈప్రభుత్వాన్ని పడగొతామన్న వారికి తగిన బుద్ధి చేప్తున్నారని గీతకార్మికులకు కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ పథకాన్ని కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.