15-03-2025 01:30:21 PM
కేసీఆర్ దగ్గర తీసుకోవడానికి ఇంకేముంది
కేసీఆర్ ఉన్న కుర్చీలో నన్ను కూర్చోబెట్టారు
మార్చి 31లోగా రైతుభరోసా నిధులు జమ చేస్తాం
కేసీఆర్.. వందేళ్లు ప్రతిపక్షంలోనే ఉండాలి.. నేను ఇక్కడనే ఉండాలి
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రసంగించారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే వ్యవస్థలు ఏర్పడ్డాయి. వ్యవస్థలను గౌరవించాల్సిన బాధ్యత మన అందరిది. గవర్నర్ ప్రసంగం లేకుండానే 2022 బడ్జెట్ సమావేశాలు ప్రారంభించారు. 2023లోనూ గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభిచాలని అనుకున్నారు. కోర్టు కఠినంగా సూచన చేయడం వల్ల గవర్నర్ ప్రసంగానికి అప్పటి ప్రభుతవ్ం అనుమతించిందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ప్రభుత్వాలు వ్యక్తుల ఆస్తికాదు.. బలహీనవర్గాలకు చెందిన మహిళా గవర్నర్ ను గత ప్రభుత్వం అవహేళన చేసిందని సీఎం ఆరోపించారు. మంత్రివర్గం ఆమోదించిన అంశాలనే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఉండదన్నారు.
మాది కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజాపాలన
మాది కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజాపాలన అని సీఎం తెలిపారు. మా విధానం.. మా ఆలోచనలు.. మేము ప్రజలకు చేసిన పనులు మాత్రమే గవర్నర్ ప్రసంగంలో పొందుపరుస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అవగాహన లేనివాళ్లు మంత్రులుగా చేశామని చెప్పుకోవడానికి అర్హత ఉందా? అని నేను అడుగుతున్నాను. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నాటి మంత్రివర్గం ఆమోదం లేకుండానే గవర్నర్ ప్రసంగం ఉందా? అని సీఎం ప్రశ్నించారు. వాళ్లకు గవర్నర్ వ్యవస్థపై నమ్మకం లేదు.. మహిళా గవర్నర్ ను అమమానించారు.. ఆ తప్పు మేము చేయమని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. గవర్నర్ వ్యవస్థను గౌరవించే బాధ్యత మాది.. గవర్నర్ ప్రసంగంలో సూచనలు చేస్తే ప్రభుత్వం స్వీకరిస్తోందని ఆయన అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో గుండుసున్నా వస్తుందని చెప్పిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. బీఆర్ఎస్ సభ్యులు ఇలానే వ్యవహరిస్తే వచ్చే శాసనసభ ఎన్నికల్లోనూ గుండుసున్నానే అవుతోందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. అబద్ధాల ప్రాతిపదికన ప్రతిపక్షాల గొంతునొక్కాలని మేము అనుకోవడం లేదని సీఎం స్పష్టం చేశారు. ప్రజల శ్రేయస్సు, వాళ్లకు మేలు జరగాలనే మేము కోరుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
రైతు ఆత్మహత్యలకు కారణం అప్పులే
సాయుధ రైంతాంగ పోరాటం జరిగిందే భూమికోసమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతు ఆత్మహత్యలకు కారణం అప్పులేనని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కార్పొరేర్ కంపెనీలు రూ. 16 లక్షల కోట్లు అప్పులు బ్యాంకులకు ఎగవేశాయి. అప్పులు చేసిన నీరవ్ మోదీ, లలిత్ మోదీ, విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోయారు. విదేశాల్లో విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవమానం భరించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం చేపట్టిన 10 నెలల్లోనే రూ. 20,617 కోట్లు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభత్వం తమదని సీఎం పేర్కొన్నారు. 25,35,000 మంది రైతులకు రుణమాఫీ చేసి.. రుణ విముక్తులను చేశామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎగవేసిన రైతుబంధు మా ప్రభుత్వం రైతు ఖాతాల్లో జమ చేసిందని చెప్పారు. గత ప్రభుత్వం రైతుబంధు కింద రూ. 10 వేలు ఇచ్చేది.. మా ప్రభుత్వం రైతుభరోసా ద్వారా రూ. 12 వేలు ఇస్తోందని సీఎం తెలిపారు. మార్చి 31లోగా రైతులందరికి ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమ చేస్తామని ముఖ్యమంత్రి రైతులకు శుభ వార్త చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా భూమిలేని నిరుపేదలకు రూ.12 వేలు ఇస్తున్నాం. సన్నవడ్లకు బోనస్ రూ. 1,206 కోట్లు ఇచ్చామన్నారు. 260 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేసి దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ గా నిలిచిందని సీఎం హర్షం వ్యక్తం చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వారి ఖాతాల్లో నగదు బదిలీ చేశామని తెలిపారు. రైతుల సమస్యల శాశ్వత పరిష్కారానికి రైతు కమిషన్ వేశామన్నారు.
కృష్ణా జలాల్లో వాటాలో తెలంగాణ రైతాంగానికి మరణశాసనం
శాసనసభలో కృష్ణాజలాలపై(Krishna Waters) కేసీఆర్ తో మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని సీఎం సవాల్ విసిరారు. సభలో కేసీఆర్ ఉన్నప్పుడే కృష్ణా జాలలపై చర్చ జరగాలని రేవంత్ డిమాండ్ చేశారు. చర్చల్లో మా తప్పు ఉందని నిరూపిస్తే నేను కేసీఆర్ క్షమాపణ చెబుతానని సీఎం స్పష్టం చేశారు. కేసీఆర్, హరీశ్ రావు నిత్యం తిట్టిపోసే చంద్రబాబు ముందు మోకరిల్లారని సీఎం ఆరోపించారు. కృష్ణా జలాల్లో వాటాలో తెలంగాణ రైతాంగానికి మరణశాసనం రాశారనన్నారు. ఉమాభారతి సమక్షంలో ఏపీ 512 టీఎంసీలు వాడుకునేందుకు ఒప్పుకున్నారు.
తెలంగాణకు 299 టీఎంసీల వాటా చాలని సంతకం చేశారని సీఎం తెలిపారు. మేము అధికారంలోకి వచ్చాక కృష్ణా పరివాహక ప్రాంతాన్ని లెక్కగట్టామన్నారు. కృష్ణ జలాల్లో తెలంగాణకు 68 శాతం రావాలి, ఏపీకి 32 శాతం వాటా అని తేలిందన్నారు. తెలంగాణకు 70 శాతం ఇవ్వాలని ప్రధాని, సంబంధిత శాఖ మంత్రులను కోరామని తెలిపారు. కృష్ణా జలాల్లో 70 శాతం పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉంది.. 30 శాతం ఏపీలో ఉందన్నారు. కృష్ణా జలాల్లో 66 శాతం ఆంధ్రప్రదేశ్, 34 శాతం తెలంగాణకు కేటాయించారని చెప్పారు. కృష్ణా జలాల్లో వాటా కోసం కేఆర్ఎంబీ, సుప్రీంకోర్టులో కోట్లాడింది తామేనని సీఎం గుర్తుచేశారు. కాళేశ్వరం కట్టడం.. కూలడం.. లక్షకోట్లు ఆవిరి మూడేళ్లలో అయిందని సీఎం సంచలన ఆరోపణలు చేశారు. చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇచ్చేందుకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడుతున్నాం. కృష్ణా జిలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 811 టీఎంసీల కేటాయింపు ఉందన్నారు.
మీ స్ట్రేచర్ పట్ల ఉన్న ఆలోచన.. స్టేట్ ఫ్యూచర్ పట్ల లేదా
మీ స్ట్రేచర్ పట్ల ఉన్న ఆలోచన.. స్టేట్ ఫ్యూచర్ పట్ల లేదా అని సీఎం ప్రశ్నించారు. ఆనాడు అధికార పార్టీగా బీఆర్ఎస్ స్ట్రేచర్ ఉండేది.. 2023 డిసెంబర్ లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్ట్రేచర్ ఇచ్చారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో గుండుసున్నా ఇచ్చి మార్చురీకి పంపించారని సీఎం ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కు ఆనాడు అధికార స్ట్రేచర్.. ఆ తర్వాత ప్రతిపక్ష స్ట్రేచర్.. గుండు సున్నా వచ్చిన తర్వాత మార్చురీలోకి వెళ్లిందని అన్నారు.. బీఆర్ఎస్ నేడు మార్చురీలో ఉందని చెప్పాను.. అందులో తప్పేముందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మార్చురీలో ఉందని నేను చెబితే.. పెద్దాయన కేసీఆర్ ను నేను అన్నట్లుగా కేటీఆర్, హరీశ్ రావు చిత్రీకరించారు.
అంత కుంచిత స్వభావం నాకు లేదు
అంత కుంచిత స్వభావం నాకు లేదన్నారు. చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao) వద్ద ఉణ్న కుర్చీని 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు గుంజుకుని నన్ను కూర్చోబెట్టారని తెలిపారు. చంద్రశేఖర్ రావు(KTR) వద్ద తీసుకోవడానికి ఇంకేముందన్నారు. వారి వద్ద ఉన్నది ప్రధాన ప్రతిపక్షహోదా. ఆ హోదా కేటీఆర్ కు లేదా హరీశ్ రావుకు కావాలి. తప్పుడు మాటలు నాకు ఆపాదిస్తున్నారు.. నేను అలా కోరుకోవడం లేదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్.. వందేళ్లు ఆయురారోగ్యాలతో ప్రతిపక్షంలోనే ఉండాలి.. నేను ఇక్కడే ఉండాలి.. చంద్రశేఖర్ రావు సూచనలు చేస్తునే ఉండలి.. నేను మంచి పరిపాలన అందిస్తూనే ఉండాలి.