calender_icon.png 21 December, 2024 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాళ్లకు, గుట్టలకు రైతుబంధు ఇద్దామా..?

21-12-2024 01:44:52 PM

రైతులను ఆదుకోవడమే మా ప్రభుత్వ ఆలోచన

హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్, పారిశ్రామికవేత్తలకూ రైతుబంధు ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. రాళ్లకు, గుట్టలకూ రైతుబంధు ఇద్దామా? అని ప్రశ్నించారు. భూముల్లో రహదారి వెళ్తే.. దానికీ రైతుబంధు జమ చేశారని, క్రషర్ యూనిట్ల భూములకూ రైతుబంధు ఇచ్చిందని సీఎం ఆరోపించారు. రైతు సమాజాన్ని ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ముందుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రైతులను ఆదుకోవడమే మా ప్రభుత్వ ఆలోచనన్నారు. రైతులకు పెట్టుబడి సహాయం ఇచ్చేందకు రైతుబంధు తెచ్చారన్న ఆయన రైతుభరోసాపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. నిజమైన లబ్ధిదారులు ఎవరికీ అన్యాయం జరగకూడదని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రైతుబంధు అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగులో లేని భూములకు రైతుబంధు ఇచ్చి రూ. 22 కోట్లకు పైగా నిదులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. రూ. 22600 కోట్ల రైతుబంధు ద్వారా ఆయాచిత లబ్ధి చేశారని తెలిపారు.

గత ప్రభుత్వం ఏటా రూ. 3 కోట్ల ఎకరాలకు రైతుబంధు ఇచ్చారు.. ఏటా రూ. 15 వేల కోట్ల రైతుబంధు ఇచ్చింది. దొంగ పాస్ పుస్తకాలు తయారు చేసుకుని రైతుబంధు లబ్ధి పొందారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలక అంశమైన రైతుబంధుపై చర్చ జరిగితే ప్రతిపక్ష నేత సలహాలు ఇస్తారనుకున్నానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జమీందార్లు, భూస్వాములకు రైతుబంధు ఇవ్వాలా?.. బీఆర్ఎస్ ఇచ్చింది కాబట్టి.. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాళ్లు, గుట్టలకూ రైతుబంధు ఇవ్వాలంటున్నారు. బీఆర్ఎస్ ను ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీని ఆదర్శంగా తీసుకుంటే తాము కూడా ప్రతిపక్షంలో ఉండేవాళ్లమని సీఎం వెల్లడించారు. 2023లో అధికారం.. 2024లో డిపాజిట్లు పోయిన మీరు మాకు ఆదర్శం కాదని సీఎం ఎద్దేవా చేశారు. రైతుబంధు అమలుపై మంత్రివర్గ ఉపసంఘం వేశామా?.. రైతుబంధుపై అన్ని వర్గాలతో ఉపసంఘం చర్చలు జరిపిందన్నారు. ప్రతిపక్ష నేతల సూచనల్లో సహేతుకత కనిపిస్తే స్వీకరిస్తాం.. బేషజాలు లేవని రేవంత్ స్పష్టం చేశారు. రైతులకు మేలు జరుగుతుందంటే ప్రతిపక్ష నేతల సూచనలు స్వీకరిస్తామని సీఎం తెలిపారు.