16-03-2025 04:36:10 PM
జనగామ,(విజయక్రాంతి): జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్(Station Ghanpur)లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy Speech) ఆదివారం పర్యటించారు. స్టేషన్ ఘన్‌పూర్ శివునిపల్లిలో ప్రజాపాలన సభా(Prajapalana Meeting)కి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సభా ప్రాంగణలో మహిళా సంఘాల స్టాళ్లను పరిశీలించిన రూ.800 కోట్ల ప్రగతి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను దివాలా త్రీయించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పదేళ్లలో రూ.1.81 లక్షల కోట్లను ప్రాజెక్టుల పేరు మీద ఖర్చు పెట్టారని మండిపడ్డారు. ఒక్క కాళేశ్వరం కోసమే రూ1.10 లక్షల కోట్లు ఖర్చు చేసి కట్టిస్తే మూడేళ్లకే కూలిపోయిందని ఎద్దేవా చేశారు. దశాబ్దాల క్రితం కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టులే ఈ నాటికి సాగు నీళ్లు అందిస్తున్నాయని సీఎం వెల్లడించారు. శ్రీరామ్ సాగర్, నాగార్జునసాగర్, కోయిల్ సాగర్ నిర్మించిందెవరు..? అని పతిపక్ష పార్టీలను ప్రశ్నించారు.
ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటున్న వ్యక్తి బాధ్యతలు నెరవేర్చటం లేదని, 15 నెలలుగా రూ.16 లక్షల జీతం తీసుకున్న వ్యక్తి అసెంబ్లీకి రావట్లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉద్యోగం చేయకుంటే, విధులకు వెళ్లకుంటే ఎవరికైనా జీతం వస్తుందా..?, మరి ప్రజల సొమ్మును తీసుకుంటూ ప్రజల కోసం సూచనలు చేస్తూ తన అనుభవాన్ని ప్రజల కోసం ఎందుకు ఉపయోగించటం లేదు..? అని అడిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే వరంగల్ కు ఎయిర్ పోర్టు, కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వరంగల్ కు రింగ్ రోడ్డు వచ్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చేకే జయశంకర్ సార్ స్వగ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా చేశామని సీఎం చప్పారు. మహిళలకు వెయ్యి బస్సులు ఇచ్చి ఆర్టీసీలో అద్దెలకు తీసుకున్నామని, మహిళల చేతనే వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు పెట్టిస్తున్నామన్నారు. తెలంగాణ కోసం సర్వం ధారపోసిన వాళ్లు తెలంగాణ జాతిపిత అవుతారే తప్ప.. ప్రజల సొమ్ము దోచుకుని ఫామ్ హౌస్ లు, పేపర్, టీవీ ఛానెల్ పెట్టుకున్న వ్యక్తి జాతిపిత ఎలా అవుతారని నిలదిశారు. కేసీఆర్ పాపాల చిట్టాను మున్ముందు కూడా విప్పుతానంటూ.. కేసీఆర్ చేసీన తప్పులకు ఒక్క ఏడాదిలోనే ఈ ప్రభుత్వం రూ.1.53 లక్షల కోట్లు వడ్డీలుగా కట్టిందన్నారు. ఐదేళ్ల కాలానికి ప్రజలు తీర్పు ఇచ్చి మమ్మల్ని పదవిలో కూర్చోబెడితే, పదేళ్లు పాటంచిన వ్యక్తి ఏడాదికే మమ్మల్లి దిగిపోమ్మని అంటున్నారని ఆగ్రహం వ్యక్తి చేశారు.